తమిళ ‘అర్జున్ రెడ్డి’గా ధనుష్! - MicTv.in - Telugu News
mictv telugu

తమిళ ‘అర్జున్ రెడ్డి’గా ధనుష్!

September 3, 2017

తెలుగు హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో కూడా తెరకెక్కనుంది. ఈ సినిమా రీమేక్ హక్కులను ధనుష్ కొనుక్కున్నాడు. శింబు, ఆర్య వంటి మాస్ హీరోలు కూడా పోటీ పడినా ధనుషే గెలిచాడు. కోటి రూపాయలకు ఈ హక్కులను చేజిక్కించుకున్నాడు.

రొటీన్ కు భిన్నంగా తీసే సినిమాల్లో నటించే ధనుష్.. అర్జున్ రెడ్డిపై ఆసక్తి చూపడం సహజమే. అయితే తమిళ అర్జున్ రెడ్డిలో హీరోగా ధనుషే నటిస్తారా? లేకపోతే మరెవరైనా నటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

అర్జున్ రెడ్డి కేరక్టర్ కు తామైతే సరిగ్గా సరిపోతామని శింబు, ఆర్య చెబుతున్నట్లు టాక్. అర్జున్ రెడ్డి కన్నడ, మలయాళ రీమేక్ హక్కులకు కూడా డిమాండ్ ఉందని సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాలోని సహజత్వం.. రియాలిటీ సినిమాలను ఇష్టపడే తమిళులకు బాగా నచ్చుతుందని ధనుష్ భావిస్తున్నాడు. ఆ ధైర్యంతో రీమేక్ హక్కులను కొన్నాడు.