హీరో ధనుష్‌కు కోర్టు షాక్.. అసలు తల్లిదండ్రులు ఎవరనే కేసులో  - MicTv.in - Telugu News
mictv telugu

హీరో ధనుష్‌కు కోర్టు షాక్.. అసలు తల్లిదండ్రులు ఎవరనే కేసులో 

February 29, 2020

Dhanush

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు,తమిళ హీరో ధనుష్‌కు ముధురై కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లను కోర్టు సమర్పించాలని ఆదేశించింది. ధనుష్ తమ కొడుకే అంటూ మూడేళ్ల క్రితం ఓ జంట పిటిషన్ వేయడంతో పలు దఫాలుగా విచారణ జరిపిన ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. సరైన పత్రాలతో రావాలని సూచించింది. 

కదిరేషన్, మీనాక్షి దంపతులు 2017లో ధనుష్ కస్తూరి రాజా కొడుకు కాదని తమ కొడుకే అంటూ పిటిషన్ వేశారు. చిన్న తనంలో తిట్టామనే కోపంతో అతడు ఇళ్లు వదిలి పారిపోయాడని పేర్కొన్నారు. అతన్ని తమ కొడుకుగా పరిగణించాలని కోరారు. దీనిపై చాలా సార్లు విచారణ చేపట్టిన కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. తాజాగా ఆయన బర్త్, స్టడీ, రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. అవి వెంట తీసుకురాలేదని ఆయన తరుపు న్యాయవాది బదులిచ్చాడు. దీనిపై సీరియస్ అయిన ధర్మాసనం వెంట తీసుకురాకుండా ఎందుకు వచ్చారని ప్రశ్నిచింది. మరోసారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో ధర్మాసం ముందు  విచారణకు రావాలని సూచించింది.  

కాగా కన్న కొడుకే తమను ఎవరో తెలియదని చెబుతుంటే భరించలేకపోతున్నామని కదిరేశన్ దంపతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డీఎన్‌ఏ చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపారు.ఇప్పటి వరకూ ధనుష్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నాన్చడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి త్వరలో జరిగే విచారణలో ఈ కేసు ఎటువంటి మలుపు తీసుకోనుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.