తెలంగాణ ప్రభుత్వం భూముల రికార్డు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌కు ఆదిలోనే సమస్య ఎదురైంది. వ్యవసాయేతర భూములు, ఆస్తులు నమోదు చేయొద్దని రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు స్టే విధించింది. ఈ పోర్టల్‌లో భద్రత అంశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. వివరాలు నమోదు కోసం ప్రజలను బలవంతం చేయొద్దని స్పష్టం చేసింది.
భద్రత నిబంధనలు పాటించకుండా వ్యవసాయేతర భూములు వివరాలు నమోదు చేయడం వల్ల సమస్యలు తలెత్తాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘గూగుల్ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్లాంటి మరో నాలుగు యాప్స్ ఉన్నాయి. అసలు ఏది నిజమైన ధరణి పోర్టల్ తెలుసుకోవడం సాధ్యం కావడం లేదు. వ్యవసాయేతర ఆస్తుల రికార్డులో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో మాకు చెప్పండి. రెడు వారాల్లో నివేదిక సమర్పించండి. అప్పటివరకు వాటిని నమోదు చేయంకడి’ అని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.