రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 29న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా తెలంగాణ ఈ పోర్టల్‌ను రూపొందించింది.
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవిష్యత్తులో స్థిరాస్తుల విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. ఇప్పటికే ధరణి పోర్టల్ గురించి రెవెన్యూ సిబ్బందికి, ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.