Dharmapuri bjp in charge kannam anjayya slams Telangana state president bandi sanjay on dalit discriminations
mictv telugu

దళితులపై బండి సంజయ్ వివక్ష.. భగ్గుమన్న అసమ్మతి

March 14, 2023

Dharmapuri bjp in charge kannam anjayya slams Telangana state president bandi sanjay on dalit discriminations

తెలంగాణ బీజేపీలో దళితులకు ప్రాధాన్యం లేదని, కొత్త వాళ్లకు పట్టగడుతూ, పార్టీని నమ్ముకున్నవాళ్లను అన్యాయం చేస్తున్నరని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఇన్ చార్జి కన్నం అంజయ్య ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పలువురు దళిత నేతలతో కలసి విలేకర్లతో మాట్లాడారు.
‘‘సంజయ్‌ నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

ముప్పై ఏళ్లుగా పార్టీని నమ్ముకుని మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దళితులకు ఒక్క పదవి కూడా ఇవ్వడం లేదు. దేశం కోసం ధర్మం కోసం కష్టపడుతున్న కార్యకర్తలను ఆదరించడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు చేరి నెలలు గడవకముందే కోర్ కమిటీలో పెద్ద పదవులు ఇస్తున్నారు. మేం సభల్లో కింద కూర్చోవాల్సి వస్తోంది.

22 శాతం ఉన్న దళితులకు పదవుల అక్కర్లేదా? మేం ప్రజలకు దగ్గరికి వెళ్తే, ‘మీకు పదవులే లేవు కాదా, మాకోసం మీరేం చేస్తారు, మిమ్మల్ని ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నిస్తున్నారు,’’ అని అంజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సంజయ్ తనకు ఆర్థికంగా సహకరించేవారికే పదువులు ఇస్తున్నారని, ఆయనకు స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. మాజీ ఎంపి వివేక్ ధోరణి కూడా సరిగ్గా లేదని, దళిత, బీసీ వర్గాల నుంచి వచ్చిన ఇలాంటి నాయకులే దళితులను పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు.