భక్తులకు గమనిక.. ఒక నెలపాటు గుడికి రావొద్దు.. - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులకు గమనిక.. ఒక నెలపాటు గుడికి రావొద్దు..

May 18, 2019

దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇళ్ల వద్దే పరిస్థితి ఇలా ఉంటే రోజూ వేలు, లక్షల మంది మంది దర్శించుకునే ఆలయాల వద్ద పరిస్థితి ఏమిటి? కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల దీనికి ఉదాహరణ. ‘భక్తునులారా.. వేలాదిగా, లక్షలాదిగా తరలిరండి’ అనే పిలుపుకు పూర్తి విరుద్ధమైన పిలుపునిచ్చింది ఆలయ బోర్డు.  

Dharmasthala Manjunatheshwara temple asks devotees to postpone visits over water crisis.

ఎండలు, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు మంజునాథస్వామి దర్శనం వాయిదా కోవాలని భక్తజనాన్ని కోరింది. ఆలయ సమీపంలోని నేత్రావతి నది అడుగంటి పోవడంతో భక్తులు ఇబ్బంది పడకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టీలు పేర్కొన్నారు. కర్ణాటకలో పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరుకున్నాయి. రాష్ర్టంలోని 176 తాలూకాలకుగాను 156 తాలూకాల్లో కరువు ఉందన ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.