ధర్నా చౌక్ కోసం జాతీయస్థాయిలో పోరు - MicTv.in - Telugu News
mictv telugu

ధర్నా చౌక్ కోసం జాతీయస్థాయిలో పోరు

July 15, 2017

ధర్నా చౌక్ కోసం మరో పోరాటానికి వామపక్షాలు, ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. జాతీయ స్థాయిలో తమ గళాన్ని వినిపించబోతున్నాయి. 22న ఢిల్లీలో జరిగే నిరసన కు అన్ని పక్షాల మద్దతు కూడగడుతున్నాయి.

పౌర హక్కులు – నిర్బంధం

అంశంపై హైదరాబాద్ లోని మగ్దుమ్ భవన్ లో సెమినార్ జరిగింది. జేఏసి చైర్మన్ కోదండరాం, వామ పార్టీల నేతలు,పౌర హక్కుల సంఘం నాయకులు, ప్రజా స్వామిక వాదులు హాజరయ్యారు. ధర్నా చౌక్ విషయం లో ఎన్ని అడ్డంకులు ,అవరోధాలు ఎదురైనా సరే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.జాతీయ స్థాయి లో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్లనున్నారు.22న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకు దిగనున్నారు.ఎన్ని విధాలుగా నిరసన తెలిపిన ప్రభుత్వం లో చలనం రాకపోవడం బాధాకరమని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.

ధర్నా చౌక్ ఎత్తివేయడం పట్ల సమస్యలు సమసి పోతాయనుకోవడం సరికాదన్నారు.” అసలు ధర్నా చౌక్ ఎప్పుడో ప్రగతి భవన్ అయిపోయింది.నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిది.అందుకే ఇందులొ అందరి భాగస్వామ్యం ఉంటుంది.జాతీయ స్థాయి లో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తాం” అని కోదండరాం అన్నారు. .రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులుకలరాయబడుతున్నాయని లెఫ్ట్ పార్టీల నేత చాడ వెంకట్ రెడి విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విదంగా ఇక్కడ పాలన సాగుతుందన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారని, కోట్లాది రూపాయలు వెచ్చిన క్యాంపు కార్యాలయం కట్టుకొని ప్రజలను దగ్గరికి రాకుండా చేస్తున్నారని వరవరరావు విమర్శించారు.