Dheeraj went to Dubai to buy an iPhone
mictv telugu

ఐఫోన్ కొనేందుకు దుబాయ్ వెళ్లిన కేరళవాసి.. కొన్ని గంటల కోసం రూ. 40 వేల ఖర్చు

September 19, 2022

Dheeraj went to Dubai to buy an iPhone

ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు వెంటనే కొనాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తుంటారు. బుకింగ్స్ ప్రారంభమైతే వెంటనే బుక్ చేసుకుంటారు. ఎందుకంటే లేటెస్ట్ ఐఫోన్ కలిగి ఉండడం స్టేటస్ సింబల్‌గా చాలా మంది భావిస్తారు.

ఈ కోవకు చెందిన ఓ కేరళ వాసి మాత్రం ఎవ్వరూ చేయని పని చేశాడు. కొత్తగా రిలీజయిన ఐఫోన్ 14 మోడల్‌ను దేశంలో అందరికంటే ముందుగా కొనాలన్న ఉద్దేశంతో ఏకంగా దుబాయి వెళ్లి మెబైల్ కొనుగోలు చేశాడు. భారత్ కంటే దుబాయిలో కొన్ని గంటల ముందు లాంఛ్ చేశారు. కొన్ని గంటలు కూడా ఓపిక పట్టని ధీరజ్ అనే యువకుడు దుబాయ్ వెళ్లి 512 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్‌ను రూ. 1.29 లక్షలు పెట్టి కొన్నాడు. రానుపోను ఖర్చులు సుమారు 40 వేలు అయ్యాయి. అయితే ధీరజ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు విడుదలైన కొత్త ఐఫోన్ మోడళ్లను ఇలాగే నాలుగు సార్లు దుబాయ్ వెళ్లి కొనుగోలు చేశాడు. భారతీయులందరి కంటే ముందుగా ఫోన్ కొన్నానన్న ఆనందం ధీరజ్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.