Dhoni good bye to IPL?
mictv telugu

ఐపీఎల్‌కు ధోని గుడ్ బై ?

November 15, 2022

ఐపీఎల్‌కు మిస్టర్ కూల్ ధోని గుడ్ బై చెప్పనున్నాడా? 2023 ఐపీఎల్ తర్వాత తప్పుకుంటాడా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఐపీఎల్‌ ధోనికీ చివరిది అని..తర్వాత ఆటకు వీడ్కోలు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ప్రచారం అవుతుంది. ఐపీఎల్‌ను వీడాక టీంఇండియా కోసం ధోని వస్తున్నాడని చెబుతున్నారు.

రానున్నరోజుల్లో టీం ఇండియాను మరింత బలోపేతం చేసే విధంగా బీసీసీఐ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టీ20లో సీనియర్లు పక్కనబెట్టి యువకులకు అవకాశం కల్పించనున్నారు. యువ ఆటగాళ్లకి మార్గనిర్దేశం చేసే విధంగా ధోనిని పిలిపించాలని బీసీసీఐ ఆలోచిస్తోందంట. తన ప్రణాళికలతో, కూల్ కెప్టెన్సీతో టీం ఇండియాకు రెండు వరల్డ్ కప్స్ అందించిన ధోనీ దీనికి సరైనోడని భావిస్తున్నారంట. అందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారని..వచ్చే ఐపీఎల్ అవ్వగానే టీంఇండియాలోకి ధోని ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మాత్రం భారత్‌కు ధోని అపార అనుభవం ఎంతగానో ఉపయోగపడుతోంది.

అసలు గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనే ధోనీ రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్సీని కూడా వదిలి..రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే వరుస చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిలు చవిచూడంతో మళ్లీ ధోనీ పగ్గాలు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నైతో అభిమానుల ముందే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని మాటిచ్చాడు.చెన్నై సూపర్ కింగ్స్‌కు నాలుగు ట్రోఫీలను అందించిన ధోనీ జట్టును వీడడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.