తలా భళా..ధోనీ ఈజ్ బ్యాక్..! - MicTv.in - Telugu News
mictv telugu

తలా భళా..ధోనీ ఈజ్ బ్యాక్..!

July 15, 2017

 

నిషేధం ముగిసింది. తెల్లారే ఉరిమే ఉత్సాహంతో టీమిండియా క్రికెటర్ ధోనీ ఓ ఫోటో సోషల్ మీడియా షేర్ చేశాడు. అంతే కాదు అయిదు అక్షరాలతో తన సత్తాను, కసిని తెలియజేశాడు. ఇంతకీ ఆ అక్షరాల్లో ఏం ఉందంటే…

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల నిషేధం శుక్రవారం ముగిసింది, దీంతో అభిమానులు చెన్నై జట్టుకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా చెన్నై సూపర్‌కింగ్స్‌ జెర్సీ ధరించి దిగిన ఓ ఫొటోను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 7వ నెంబర్‌ జెర్సీ ధరించిన ధోనీ ఇంటి ముందు దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. జెర్సీపై తన పేరు ఉండాల్సిన స్థానంలో ‘తలా’ అని పేర్కొన్నాడు. తలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్‌మీడియాలో విపరీతమైన లైక్‌లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు 2018 ఐపీఎల్‌ సీజన్‌ కోసం తమ పాత ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశముంటే.. మాజీ కెప్టెన్‌ ధోనీని వదులుకునే అవకాశమే లేదని చెన్నై ఫ్రాంఛైజీ ప్రతినిధి జాన్‌ తెలిపారు.

Posted by MS Dhoni on Friday, 14 July 2017