125 క్యాచ్ లు...ధోనీ మరో రికార్డ్ - MicTv.in - Telugu News
mictv telugu

125 క్యాచ్ లు…ధోనీ మరో రికార్డ్

May 13, 2017

టీ 20ల్లో ధోనీ మరో రికార్డ్ సాధించారు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్‌ కీపర్‌గా రికార్డులకెక్కారు. 124 క్యాచ్‌లు పట్టుకుని శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర ఈ జాబితాలో ఇప్పటిదాకా తొలి స్థానంలో ఉండేవారు. ఢిల్లీతో మ్యాచ్‌లో క్రిస్టియన్‌ బౌలింగ్‌లో మార్లోన్‌ శ్యామ్యూల్స్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా ధోని ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

హుక్‌ చేసేందుకు డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మెన్‌ శ్యామూల్స్‌  యత్నించగా, అది ధోనీవైపు ఎడ్జ్‌ తీసుకుంది. ఈ దశలో తనదైన వేగంతో ధోనీ క్యాచ్‌ అందుకున్న తీరు మరోసారి అతని అత్యుత్తమ వికెట్‌ కీపింగ్ స్పెషాలిటీని చాటింది.