సీఎస్‌కే బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ - MicTv.in - Telugu News
mictv telugu

సీఎస్‌కే బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ

March 24, 2022

 

gf

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ధోని స్థానంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కొత్త కెప్టెన్‌గా నియమించాడు. ఇందుకు సంబంధించి సీఎస్‌కే ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆటగాడిగా మాత్రం ధోని కొనసాగనున్నాడు.

గురువారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్‌కు గురైయ్యారు. ఈ మేరకు కాసేపటి క్రితమే మహేంద్ర సింగ్ ధోనీ అధికారిక ప్రకటన చేశాడు. ఇక తన కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు ధోని తెలిపాడు.

 

మరోపక్క ఈ విషయాన్ని స్వయంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “ధోని తన నాయకత్వ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకోవడానికి మహేంద్రసింగ్ ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్ కు కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తాడు. వచ్చే ఏడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ లేకపోవడం.. తీరని లోటు “అంటూ సీఎస్‌కే యాజమాన్యం ట్వీట్ చేసింది.