భార్యకు ప్రేమగా ధోనీ... - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు ప్రేమగా ధోనీ…

November 20, 2017

భారత క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మళ్లీ ఫ్యామిలీ ముచ్చటతో అభిమానుల ముందుకొచ్చాడు. ధోనీ భార్య సాక్షి ఆదివారం 29వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సదర్భంగా ధోనీ ఆమె పక్కన కూర్చుని ప్రేమగా కేక్ కట్ చేయించాడు.

ఆమెకు ఓ ముక్కను తినిపించాడు. తర్వాత సాక్షి డ్యాన్స్ చేసింది. వీరి బిడ్డ… జీవ కూడా కేక్ తింటూ చూడముట్చటగా కనిపించింది. వేడుకల్లో స్నేహితులు కూడా హల్ చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌కు కాస్త గడువు ఉండటంతో ధోనీ కుటుంబసభ్యుల మధ్య ఎంజాయ్ చేస్తున్నాడు.