‘వహ్వా.. ధోనీ’..! - MicTv.in - Telugu News
mictv telugu

‘వహ్వా.. ధోనీ’..!

May 17, 2017

కెప్టెన్సీ లేకపోయిన ఐపీఎల్లో మహేంద్రసింగ్‌ ధోనీ దుమ్మురేపుతున్నాడు. స్టన్నింగ్ ఫెర్మామెన్సతో అదురగొడుతున్నాడు. ఐపీఎల్ 10 సీజన్ లో ధోనీ అద్భుతమైన బ్యాటింగ్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె మాజీ సారథి ధోనీ (40; 26 బంతుల్లో 5×6) ఇరగదీశాడు. స్లో పిచ్‌పై వరుస సిక్సర్లతో చెలరేగి పుణె అదృష్టాన్నే మార్చేశాడు. ఈ పిచ్‌పై 130 అయినా చేయలేరనుకున్న స్కోరును ఏకంగా 160 దాటించాడు.

మహి ఇన్నింగ్స్‌లో సిక్సర్లు తప్ప ఫోర్లు లేవంటేనే అర్థం చేసుకోవచ్చు బంతిని ఎంత కసిగా.. బలంగా బాదాడో! చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి అలరించే ఇన్నింగ్స్‌ను చూసిన అభిమానులు ఆనందంలో మునిగారు. అభిమానులే కాదు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ధోనీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మైకేల్‌ క్లార్క్‌, మహ్మద్‌ కైఫ్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం తమ ఆనందాన్ని ట్వీట్లతో పంచుకున్నారు.

HACK:

  • Dhoni’s stunning performance in IPL season 10.