త్వరలో ధూమ్-4.. దమ్ముంటే పట్టుకోండి.. దొంగల సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో ధూమ్-4.. దమ్ముంటే పట్టుకోండి.. దొంగల సవాల్

July 4, 2022

ఈ మధ్య దొంగలు కూడా తమ క్రియేటివిటికి తగ్గట్లుగా, విచిత్రంగా చోరీలు చేస్తున్నారు. చోరీ చేసే ముందు పూజలు చేయడం, కొత్త కాపురానికి ఏయే సామాన్లు కావాలో వాటిని మాత్రమే దోచుకోవడం, దోచుకున్న తర్వాత వెళ్తూ వెళ్తూ ఐ లవ్ యూ అని రాయడం వంటి విచిత్రమైన పనులతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఒడిశాలోని నవరంగ్పుర్లో దొంగలు తమ చేతివాటం చూపించారు. శుక్రవారం జగన్నాథుని రథయాత్ర సందర్భంగా సెలవు ఉన్న నేపథ్యంలో నవరంగ్పుర్ స్కూల్‌ను టార్గెట్ చేశారు.

కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్లు, సౌండ్ బాక్సులు ఎత్తుకెళ్లిపోయారు. అయితే పోతూ.. పోతూ క్లాస్ రూమ్స్‌లోని బ్లాక్ బోర్డుపై.. ‘ధూమ్-4 త్వరలోనే రాబోతుంది’ అంటూ రాసివెళ్లారు. శనివారం ఉదయాన్నే స్కూలుకు వచ్చిన స్టాఫ్, టీచర్స్ వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. ఆ తర్వాత బ్లాక్బోర్డులపై దొంగలు రాసింది చూసి షాక్ అయ్యారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఖతీగూడ పోలీస్స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు.. డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు.