మొన్న చిరంజీవి మృతి.. ఇప్పుడు ధ్రువ్‌కు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

మొన్న చిరంజీవి మృతి.. ఇప్పుడు ధ్రువ్‌కు కరోనా

July 15, 2020

Dhruva Sarja Test Corona Positive

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా టెన్షన్ పుట్టిస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరు వైరస్ బారిన పడతారో తెలియడం లేదు. ఇప్పటి బాలీవుడ్, టాలీవుడ్‌ను ఈ మహమ్మారి కన్నడ ఇండస్ట్రీని కూడా తాకింది. ప్రముఖ హీరో అర్జున్ మేనల్లుడు ధ్రృవ సర్జతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇటీవల చనిపోయిన చిరంజీవి సర్జకు ఇతడు సోదరుడు. అన్న మరణం నుంచి ఇంకా కోలుకోని ఆ కుటుంబంలోకి కరోనా కూడా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ధృవ సర్జ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అతడు భార్యతో కలిసి ఇటీవల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ టెస్టుల్లో వారిద్దరికి స్వల్పంగా కరోనా ఉందని తేలింది. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ధృవ సర్జ స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. తమ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. త్వరలోనే తాము వైరస్‌ నుంచి కోలుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఇటీవలే సీనియర్ నటి, ఎంపీ సుమలత కూడా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. వరుస పాజిటివ్ కేసులతో ఫిలిం ఇండస్ట్రీలో కలవరం మొదలైంది.