డయాబెటిస్ ఉందో లేదో కళ్లు చూసి చెప్పొచ్చు! - MicTv.in - Telugu News
mictv telugu

డయాబెటిస్ ఉందో లేదో కళ్లు చూసి చెప్పొచ్చు!

August 19, 2019

Diabetes symptoms in eyes 

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. వయోభేదం లేకుండా అందరిపైనా విరుచుకుపడుతున్న మధుమేహం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఎప్పటికప్పుడు తగిన చికిత్స తీసుకుంటూ, వైద్యుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఆరోగ్యవంతులు కూడా దీనిపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి లక్షణాలను ముందుగానే పసిగట్టాలి. 

డయాబెటిస్‌లో ప్రధానమైన టైప్-2 డయాబెటిస్‌ను కళ్లను చూసి గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఒడిదుడుకులకు లోనైనప్పుడు కంటిచూపు మసకబారుతుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. శరీరంలో మధుమేహం తలెత్తిందనడానికి ఇది చిహ్నం. అధిక చక్కెర స్థాయి రెటినాను దెబ్బతీస్తుంది. మీరు ఏదైనా వస్తువును స్పష్టంగా చూడలేకపోతుంటే కేవలం చూపు కోణంలోనే కాకుండా డయాబెటిస్ కోణంలోనూ ఆలోచించాలి. వెంటనే కంటి వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అదృష్టవశాత్తూ డయాబెటిస్ రాకుంటే ఫర్వాలేదు. వచ్చిందని తెలిస్తే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. పొగ, మద్యపానం అలవాట్లను వెంటనే మానుకోవాలి.