రైతుకు దొరికిన వజ్రం.. విలువ ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

రైతుకు దొరికిన వజ్రం.. విలువ ఎంతో తెలుసా?

May 5, 2022

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సామాన్య రైతును అదృష్టం వరిచింది. భూమిని లీజుకు తీసుకొని, వ్యవసాయమే జీవితంగా కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతుకు గనిలో విలువైన వజ్రం దొరికింది. రైతు మాట్లాడుతూ.. “నా పేరు ప్రతాప్ సింగ్ యాదవ్. మాది పన్నా జిల్లా. నేను చాలా పేద రైతును. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కూలీగానూ పనిచేస్తున్నా, గత మూడు నెలలుగా ఈ గనిలో ఎంతో శ్రమించాను. ఈ క్రమంలో నాకు 11.88 క్యారెట్ల వజ్రం దొరికింది. నాకు దొరికిన డైమండ్‌ను వజ్రాల కార్యాలయంలో అప్పగించాను. డైమండ్‌కు వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా. నా పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తా” అని ఆయన అన్నారు.

వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ మాట్లాడుతూ.. ”ఇది ఎంతో నాణ్యమైన వజ్రం. త్వరలోనే వేలం జరగనుంది. ఈ వజ్రాన్ని అమ్మకానికి ఉంచి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధర నిర్ణయిస్తాం. ఈ డైమండ్‌కు సుమారు రూ.50 లక్షల వరకు ధర పలుకుతుంది అని నా అంచనా” అని అన్నారు. ఈ వజ్రాన్ని వేలం వేసి ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి వచ్చిన మొత్తాన్ని రైతుకు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.