కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. పటిష్ట భద్రత ఉన్న ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. రూ.46 లక్షల విలువైన 49 గ్రాముల డైమండ్ నెక్లెస్ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేవీపీ భార్య సునీత తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 11న సునీత తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి ఓ ఫంక్షన్కు వెళ్ళారు. ఫంక్షన్ నుండి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్ రూమ్లో నెక్లెస్ను పెట్టగా… కొద్దిసేపటికే నెక్లెస్ మాయమవడంతో సునీత ఇల్లంతా వెతికారు. డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ రెండు రోజుల క్రితం కేవీపీ భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.