పాతరూట్లోనే మళ్లీ గర్భం దాల్చిన మిస్ ఇండియా... - MicTv.in - Telugu News
mictv telugu

పాతరూట్లోనే మళ్లీ గర్భం దాల్చిన మిస్ ఇండియా…

November 18, 2017

మాజీ మిస్ ఇండియా డయానా హేడెన్ మళ్లీ కాబోతోంది. ఈ సారి కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. మూడేళ్ల కిందట శీతలీకరించిన తన అండాలతో ఆమె గర్భం దాల్చింది. 44 ఏళ్ల డయానా ఎనిమిదేళ్ల కిందట కూడా ఫ్రీజ్ చేసిన అండం సాయంతో గర్భం దాల్చి ఒక బాబుకు జన్మనిచ్చింది.

సంతానోత్పత్తి సమస్యలకు చక్కని పరిష్కారం లభింస్తోందనడానికి హేడెన్ ఉదంతం చక్కని ఉదాహరణ అని సంతాన సాఫల్య వైద్యురాలు నందితా ఫాల్కేష్కర్ చెప్పారు. కాస్త లేటు వయసులో గర్భం దాల్చాలనుకునే మహిళలకు ఫ్రీజ్ ఎగ్స్ విధానం వరం లాంటింది. ఇదివరకు ఈ విధానంలో సమస్యలు ఉండేవి. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో సమస్యలు తొలగిపోతున్నాయని హేడెన్ కు చికిత్స అందిస్తున్న నందిత చెప్పారు..

‘ఐవీఎఫ్ వైద్యులు దేవదూతలు.. నాకు కవలలు పుడుతున్నందుకు సంబరంగా ఉంది’ అని హేడెన్ చెప్పింది. హేడెన్ కు గర్భాశయ సమస్యలు ఉండేవని, దాంతో ఆమె తన అండాలను శీతలీకరించుకుందని చెప్పారు. తమ క్లినిక్ లో వేలమంది మహిళలు తమ అండాలను భద్రపరచుకుంటున్నారన్నారు.