నా భర్త అన్నదాంట్లో తప్పేముంది?: రోజా - MicTv.in - Telugu News
mictv telugu

నా భర్త అన్నదాంట్లో తప్పేముంది?: రోజా

May 7, 2022

”నా భర్త సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్. నా భర్త అన్నదాంట్లో తప్పేముంది. ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు ఆ రాష్ట్రంలోనే పని చేసేలా ఉంటే, అందరికీ ఉపాధి లభిస్తుందని ఆయన ఉద్దేశ్యం. ఆ వ్యాఖ్యలను కొంతమంది టీడీపీ నాయకులు ప్రజలకు వేరే అర్ధం వచ్చేలా వక్రీకరిస్తున్నారు. ఆ లెక్కన విశాఖలో షూటింగ్స్ చేయమని ప్రభుత్వమే జీవో ఇచ్చింది. మరి తెలుగు సినిమా నిర్మాతలు అక్కడ షూటింగ్‌లు చేస్తున్నారా?” అని ఆర్కే రోజా టీడీపీ నాయకులపై తీవ్రంగా మండిపడింది.

ఇటీవలే తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణి తెలుగు రాష్ట్రాల్లోని వైజాగ్, హైదరాబాద్‌లో షూటింగ్ చేవొద్దని తమిళ పరిశ్రమ హీరోలను, నిర్మాతలను వేడుకున్న విషయం తెలిసిందే. పక్క రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో షూటింగులు చేయడం ఆపాలని సెల్వమణి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. దాంతో పలువురు సినీ ప్రముఖలు, రాజకీయ నాయకులు సెల్వమణిపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో తన భర్త చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ రోజా శనివారం మీడియా ముందు సెల్వమణి ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వివరించారు.