did naga chaitanya meet samantha in hospital'
mictv telugu

ఎట్టకేలకు సమంతని కలిసిన నాగచైతన్య ?

November 2, 2022

సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవటంతో ఆమె మాజీ భర్త నాగ చైతన్య ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఇది ఎక్కడా సాక్షాలతో లీక్ కాలేదు. నిజానికి ఇంత హైప్రొఫైల్ సెలబ్రిటీలు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచే రోజులు ఇప్పుడు లేవు. ఎలాగోలా ఎవరైనా ఒకరు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేస్తారు. అయితే చైతు సమంతని హాస్పిటల్ బెడ్‌పై కలిసి పరామర్శించినట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ సమంత ఏ ఆసుపత్రిలో లేదన్నది నిజం. ఆమె హైదరాబాద్‌లోని తన ఇంట్లో యథావిధిగా చికిత్స తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు చైతు ఆసుపత్రికి వెళ్లి సమంతని కలిసాడన్నది నిజం కాకపోవచ్చు.

ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఆరోగ్యంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు స్పందించారు. అఖిల్, సుశాంత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని.. అందుకు తగినంత బలం చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో మాజీ భర్త నాగచైతన్యపై విమర్శలు వచ్చాయి. ఎంత విడాకులు తీసుకున్నా చైతు ఒకసారి వెళ్లి సమంతని పరామర్శిస్తే బావుండు అని కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సామ్ ని చైతు కలిసాడని అక్కినేని ఫాన్స్ నుండి లీక్స్ వచ్చాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా సమంత సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలని ఆమె శ్రేయోభిలాషులు అందరూ కోరుకుంటున్నారు.