Did Nitish Kumar 'insult' KCR in Patna? Watch viral video
mictv telugu

‘అవమానం.. ఇందుకేనా సీఎం కేసీఆర్ బీహార్‌కు వెళ్లింది..?’.. BJP ట్రోలింగ్

September 2, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ రాజధాని పట్నాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌తో తాజా రాజకీయాలపై చర్చలు జరిపిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గోన్నారు. ఆ సమయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే కేసీఆర్ కలగజేసుకొని.. కూర్చోండి నితీష్ జీ.. విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ ట్రోలింగ్ చేస్తోంది. కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది.

 

ఆ మీడియా సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మంత్రి అభ్యర్థిగా నితిష్‌కుమార్ పేరును మీరు ప్రతిపాదిస్తారా? అని విలేకరి అడిగారు. దానిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ”నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి నేనెవరిని? ఒకవేళ నేను ప్రతిపాదించినా కొందరు వ్యతిరేకించవచ్చు. అందరం కూర్చుకొని మాట్లాడతాం.” అని స్పష్టం చేశారు. ఆ ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెబుతున్న సమయంలోనే నితీష్ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ విజ్ఞప్తితో మళ్లీ కూర్చుకున్నారు.

ఈ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఇలా అవమానానికి గురయ్యేందుకేనా తెలంగాణ నుంచి బిహార్ వెళ్లింది అని? సెటైర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతుంటే కనీస మర్యాద లేకుండా నితీశ్ కుమార్ వెళ్లిపోయారు అని పేర్కొన్నారు.