భారత్, చైనాల మధ్య గతకొన్నెళ్లుగా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి సంబంధాలు. 2020 నుంచి కొనసాగుతున్న LACవివాదం ఇరు దేశాల మధ్య సంబంధాన్ని మరింత దూరం చేసింది. అమెరికాతో భారత్ స్నేహం, ప్రపంచవ్యాప్తంగా భారత్ కు పెరుగుతున్న ఆదరణ చూసి చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తట్టుకోలేకపోతున్నారు. కానీ ప్రధానమంత్రి మోదీ, భారత్ గురించి చైనా ప్రజలు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. చైనా ప్రభుత్వం మోదీ, భారత్ పై వివక్ష చూపిస్తున్నప్పటికీ…చైనా ప్రజలు మాత్రం ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. ఇది మేము చెబుతున్న మాట కాదు. ఈ విషయాన్ని చైనా జర్నలిస్టు ముచున్షన్ ది డిప్లోమాట్ లో కథనంలో ప్రచురించడంతో తెరపైకి వచ్చింది. భారత్ పై చైనా ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉందో..అక్కడి ప్రజలకు ప్రజలకు మోదీ అంటే ఎంత ఇష్టమే ము చున్షన్ ఈ కథనంలో వివరించారు.
ప్రధాని మోదీ చైనీస్ మారుపేరు అర్థం ఏమిటి?
చైనా జర్నలిస్ట్ ము చున్షన్ ‘ది డిప్లొమాట్’లో తన కథనంలో, నరేంద్ర మోడీ గురించి చైనా ప్రజలలో చాలా ప్రజాదరణ ఉందని, అక్కడి ప్రజలు కూడా ఆయన గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారని రాసుకొచ్చారు. అంతేకాదు చైనా ప్రజలు ప్రధాని మోదీకి మారుపేరు కూడా పెట్టారట. చున్‌షాన్ ప్రకారం చైనా ప్రజల్లో మోదీ పేరు ‘లావోషియన్’గా మారిపోయింది. చైనీస్ భాషలో, ‘లావో జియాన్’ అంటే – కొంత అసాధారణమైన శక్తిని కలిగి ఉన్న పాత అమర వ్యక్తి అని అర్థం. ఈ ముద్దుపేరుకు అర్థం తెలుసుకుంటే నరేంద్రమోదీపై అక్కడి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో అంచనా వేయవచ్చు.
భారత్, చైనా మధ్య సంబంధాలపై అభిప్రాయం ఏమిటి?
చైనా జర్నలిస్ట్ ము చున్షన్ ‘ది డిప్లొమాట్’లో చైనా సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యారని రాశారు. ఈ వేదికపై చైనా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయని చైనా ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. అయితే అమెరికాతో భారత్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని వారు ఇష్టపడటంలేదని చున్షన్ రాశారు. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తే.. ఇప్పుడు చైనాతో చేస్తున్నట్టుగానే అమెరికా, పాశ్చాత్య దేశాలు అణిచివేసేందుకు ప్రయత్నిస్తాయని చైనీయులు నమ్ముతున్నారని ఆ కథనంలో రాశారు. ‘ది డిప్లొమాట్’లో వచ్చిన ఈ కథనం ప్రకారం.. చైనా, భారత్, రష్యాల మధ్య సహకారం బలపడటం వల్ల పాశ్చాత్య దేశాలు ఒత్తిడికి లోనవుతాయని చైనా ప్రజలు విశ్వసిస్తున్నారని రాశారు.