టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథనాయకుడుగా ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం “గని”. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథనాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా గని ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.