ప్రభాస్ అంత చనువుగా ఉంటాడని అనుకోలేదు: భాగ్యశ్రీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ అంత చనువుగా ఉంటాడని అనుకోలేదు: భాగ్యశ్రీ

March 4, 2022

20

“ప్రభాస్ క్రేజ్ గురించి విన్నాను. కానీ, ఇంతకు ముందు ఎక్కడా నేను అతనిని చూడలేదు. ‘రాధే శ్యామ్’ సినిమా సెట్లోనే మొదటిసారి చూశాను. ఎలా పలకరించాలా అని అనుకుంటూ ఉండగానే, నా దగ్గరికి వచ్చి నేను మీ అభిమానినంటూ చెప్పాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను” అంటూ బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ అన్నారు. ‘రాధే శ్యామ్’ సినిమాలో ఆమె ప్రభాస్‌కి తల్లిగా నటించారు.

ఈ సందర్భంగా సినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ప్రభాస్‌ మంచితనం గురించి ప్రస్తావించారు. ఆయన అంత సింపుల్‌గా ఉంటారనీ, అంత చనువుగా మాట్లాడతాడని తాను అస్సలు ఊహించలేదు అని ఆనందం వ్యక్తం చేసింది.

మరోపక్క ప్రభాస్‌ మంచితనం గురించి బాలీవుడ్ నటుడు అమితా బచ్చన్ సైతం ప్రస్తావించారు. ఆయన ఇంటి నుంచి తెప్పించే భోజనం ఓ ఆర్మీ సైన్యానికి వడ్డించొచ్చు అంటూ ప్రశంసించారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తాడనీ, అందరినీ సమానంగా గౌరవిస్తాడని ఇప్పటికే ప్రభాస్‌తో పని చేసిన వారంతా ప్రస్తావించిన విషయం తెలిసిందే.