Didn't play T20 for three years.. How to choose?: Akash Chopra
mictv telugu

మూడేళ్లుగా టీ20నే ఆడలేదు..ఎంపిక ఎలా?: ఆకాశ్ చోప్రా

September 19, 2022

టీమిండియా జట్టు విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, షమీ, ఉమేశ్ యాదవ్‌ని ఎలా ఎంపిక చేస్తారని, షమీ ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను కూడా ఆడలేదని, ఉమేశ్ అయితే 2010 నుంచి ఇప్పటివరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదని ఆయన ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.

 

“గత ప్రపంచ కప్ తర్వాత భారత్ చాలా టీ20లను ఆడింది. అయితే, ప్రస్తుత సంవత్సరంలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని షమీని.. మూడేళ్లపాటు జాతీయ జట్టులోనే లేని ఉమేశ్ యాదవ్‌ను ఆసీతో సిరీస్‌కు ఎంపిక చేసింది. ప్రపంచకప్‌నకు ఇంకా నాలుగు వారాలే మిగిలిన ఉన్న సమయంలో వీరిద్దరిని ఆసీతో సిరీస్‌లో భాగం చేశారు. ఇప్పుడు ఈ ప్లాన్స్ అన్నీ తలకిందులైనట్టుగా అనిపిస్తోంది” అని ఆకాశ్ చోప్రా రాసుకొచ్చాడు.

అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. ”షమీ, ఉమేశ్ లాంటి అనుభవమున్న ప్లేయర్లు ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి మొత్తం 15 మందిని బీసీసీఐ ఎంపిక చేసింది. మరో నలుగురిని స్టాండ్ బై ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది. బీసీసీఐ తీసుకున్ననిర్ణయం సరైనదే” అని సమాధానం ఇచ్చారు.