భారీ షాక్.. డీజిల్‌పై రూ. 25 పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

భారీ షాక్.. డీజిల్‌పై రూ. 25 పెంపు

March 21, 2022

003

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. దాదాపు 40 శాతం ధర పెరగడంతో మన దేశంలోని చమురు సంస్థలు కూడా రేట్లు పెంచేస్తున్నాయి. టోకుగా విక్రయించే కంపెనీలకు, సంస్థలకు డీజిల్‌ను లీటరుకు రూ. 25 పెంచి అమ్ముతున్నాయి. కానీ, రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తొందర్లోనే బంకుల్లో అమ్మే డీజిల్ రేటు ఆ మేరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రోజువారీ విధానంలో ధరలు పెరుగగా, ఇప్పుడు ఒకేసారి 25 రూపాయలు పెరగబోతోంది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ పాటికే రేట్లు పెంచాల్సి ఉండగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రేట్ల పెంపును తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది.