భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తాపడింది. క్రాసింగ్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్ రోడ్డు పక్కన పడిపోయింది. ట్యాంకర్ ను బయటకు తీసే అవకాశం లేదు. ఇదే అదునుగా భావించిన గ్రామస్తులు ఎగబడ్డారు. క్యాన్లు, బకెట్లు తీసుకుని డీజిల్ తీసుకెళ్లారు. డ్రైవర్ ఎంత మొత్తుకున్నా వినకుండా డీజిల్ ఖాళీ చేశారు గ్రామస్థులు.
ట్యాంకర్ బోల్తాపడింది…సాయం చేద్దామన్న ఇంగితజ్నానం జనాల్లో లేకుండా పోయింది. డీజిల్ దోచుకెళ్లడం ఒకటే తప్పా..ఏదైన ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన లేదు. అంతటితో ఊరుకోలేదు..తమకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి మరీ రప్పించుకున్నారు. ఫ్రీ గా వస్తే దేన్ని కూడా వదలరు కదా. ఆ మధ్య చేపల లారీ, బీర్ లోడ్ తో వెళ్తున్న లారీలు బోల్తాపడినప్పుడు కూడా ఇలానే ప్రవర్తించారు జనాలు.