ఏది ఆరోగ్యానికి మంచిది? చికెనా.. మటనా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏది ఆరోగ్యానికి మంచిది? చికెనా.. మటనా..

May 12, 2022

మాంసాహారులు ఎక్కువగా వినియోగించే వాటిలో చికెన్, మటన్‌లు తప్పనిసరిగా ఉంటాయి. అయితే వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే అంశంపై జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది చికెన్ మంచిదని ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు. కానీ, మటన్‌లో కూడా మంచి విషయాలు చాలా ఉన్నాయి. మేక, కోడిలలో ఏ భాగంలో ఎంత కేలరీలు ఉంటాయి? ఎంత ఫ్యాట్ ఉంటుంది? ఏ పీస్ తింటే మన శరీరానికిసరిపోతుంది అనే అంశాలను పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ సాధారణంగా చికెన్ మంచిదని ఎక్కువ మంది నమ్ముతారు. కానీ, కోడిలో కొన్ని భాగాలే మంచివి. కోడి కాళ్లు (లెగ్ పీసులు), వింగ్స్, తొడ భాగంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సోడియం ఎక్కువ. దీంతో ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ తినాలనుకునేవారు బ్రెస్ట్ భాగం (ఛాతీ కండరం) తీసుకుంటే మంచిది. మటన్ చికెన్‌తో పోలిస్తే మటన్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మేక తొడ కండరాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ కూడా తక్కువగా ఉంటాయి. ఐరన్, పొటాషియం వంటివి తగు మోతాదులో అందుతాయి. ఇక చేపలలో ఏ భాగమైనా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణుల అభిప్రాయం. మొత్తానికి చికెన్ బ్రెస్ట్, మటన్ లెగ్స్ తినడం ఆరోగ్యానికి మంచిదని తేల్చారు.