ఏది పగలు? ఏది రాత్రి? ఏ మహత్మా.. ఓ మహర్షీ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఏది పగలు? ఏది రాత్రి? ఏ మహత్మా.. ఓ మహర్షీ..!

November 24, 2017

ప్రకృతి సహజత్వానికి  మనిషి చేసే కీడు అంతా ఇంతాకాదు.  ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీ పుణ్యమా పగటికి, రాత్రికి తేడా లేకోండా పోతోంది. భవిష్యత్తులో ఏది పగలో ఏది రాత్రో తెలుసుకోలేని పరిస్థితి దాపురించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2012 నుంచి 2017 మధ్య రాత్రిపూట కృత్రిమ కాంతులతో వెలిగే ప్రాంతం ప్రతియేటా  2.2 శాతం పెరిగినట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జీయోసైన్సెస్‌ (జీఆర్‌సీజీ) అధ్యయనంలో తేలిసింది.అధ్యయనంలో భాగంగా త్రిపూట కృత్రిమ దీపాలతో వెలిగిపోతున్న ప్రాంతాలను పరిశోధకులు ఉపగ్రహ చిత్రాల సాయంతో విశ్లేషించారు. జనసాంద్రత ఎక్కవ ఉన్న చోట్ల పగలు, రాత్రి మధ్య తేడా తగ్గుతున్నట్లు తేల్చారు. పశ్చిమాసియా, సింగపూర్, మనీలా, టోక్యో వంటి  ఆసియా ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని అధ్యయనకర్త కిస్టోఫర్‌ కీబా  చెప్పారు. అయితే పశ్చిమ ఆస్ట్రేలియాలో మాత్రం రాత్రి వెలుగులు ఇటీవల కాస్త తగ్గాయన్నారు. పగలు, రాత్రి మధ్య తేడా  తగ్గుతూపోతే.. ప్రకృతికేకాకుండా మనుషుల ఆరోగ్యానికి కూడా ముప్పు ఉంటుదని ఆయన హెచ్చరించాడు. పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి.