Differences between Krishna and NTR
mictv telugu

కృష్ణ-ఎన్టీఆర్ మధ్య విభేదాలు…కారణాలు ఇవే…

November 15, 2022

కృష్ణ, ఎన్టీఆర్‌ల బంధం అచ్చం సినిమాలాగే సాగింది. ఎన్నో మలుపులు..మరోన్నో అనుహ్య ఘటనలతో దోస్తీ నడిచింది. అల్లూరి సీతారామరాజు సినిమాతో విడిపోయిన వీళ్లు..తెలుగువీర లేవరా సినిమాతో మళ్లీ కలిశారు. ఈ గ్యాప్‌లో ఎన్నో మలుపులు ఉన్నాయి. కృష్ణ, ఎన్టీఆర్ మధ్య యుద్ధం మామూలుగా నడవలేదు. టాలీవుడ్ హీరోలు రెండువర్గాలుగా విడిపోయేలా చేసింది. మొత్తానికి కృష్ణ 3వందలో సినిమా ఇద్దర్నీ కలిపింది.

ఈ సినిమాతో విభేదాలు

అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు. ఈ సినిమాకోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. ఇంతలో ఇదే సబెక్ట్‌తో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రం ప్రకటించేశారు. దీంతో ఎన్టీఆర్ అల్లూరి సినిమా ప్రయత్నాలు ఆపారు. చివరకు కృష్ణయే అల్లూరి సీతారామరాజుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమానే ఎన్టీఆర్‌కు కోపం తెప్పింది. అప్పటి వీరి మధ్య మాటలు లేవు.

ముదిరిన వివాదం

ఆ తర్వాత దానవీరశూరకర్ణ సినిమాతో వివాదం ముదిరింది.ఎన్టీఆర్‌కు ఏఎన్ఆర్ అండగా నిలిస్తే..కృష్ణకు శోభన్ బాబు, కృష్ణంరాజు మద్దతు తెలిపారు.ఆర్నెళ్లపాటు వీరిద్దరి మధ్య వార్ నడిచింది. చివరకు ఎన్టీఆరే సాధించారని చెబుతారు. ఆ తర్వాత చాలా రోజులవరకు ఇద్దరు మాట్లాడుకోలేదు.

అనూహ్యంగా…
అనూహ్యంగా వయ్యారిభామలు వగలమారి భర్తలు సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకెళ్లిన ఎన్టీఆర్‌కు కృష్ణ సపోర్ట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీ కావడంతో కృష్ణ సినిమాల్లో లీనమయ్యారు.కొన్నాళ్లకు కృష్ణ పై కాంగ్రెస్ కన్నుపడింది. ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఢీకొట్టే సరైనవాడు అని చెప్పి పార్టీలో చేర్చుకుంది. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కొన్ని సినిమాలూ చేశారు. రాజీవ్ గాంధీ మృతి తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరమ్యారు.

తెలుగు వీర లేవరా కలిపింది…

కృష్ణ 3వందల సినిమా తెలుగు వీర లేవరా సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్,ఏఎన్నార్‌లు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఇద్దరి మధ్య విభేదాలే తలెత్తలేదు.దోస్తీ చాలాకాలంపాటు సాఫీగా సాగిపోయింది.