డిజిటల్ గ్రామంగా దొండపాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

డిజిటల్ గ్రామంగా దొండపాడు..!

July 18, 2017

మాతృభూమిపై మమకారం మహత్తర ఆలోచన వైపు అడుగులు వేయించింది. డిజిటల్ తెలంగాణ సాధించే దిశగా ఎన్నారై అప్పిరెడ్డి అన్నపరెడ్డి పయనించారు. దత్తత తీసుకుని పుట్టిన పల్లెని డిజిటల్ విలేజ్ గా తీర్చిదిద్దారు.

ఎన్నారైల డ్రీమ్ ప్రాజెక్ట్ డిజిథాన్. ఇందులో భాగంగా తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకుని సంపూర్ణ డిజిటల్ విలేజ్ గా మార్చారు. తొలి డిజిటల్ గ్రామంగా సూర్యాపేట జిల్లాలోని దొండపాడు రెడీ అయింది. వంద శాతం అక్షరాస్యత గల పల్లెగా మారింది. ఈ 30న తొలి డిజిథాన్ విలేజ్ గా ముగింపు వేడుక జరుపుకోబోతోంది.

డిజిథాన్‌తో తెలంగాణ పల్లెల్లో సాంకేతిక వెలుగులు నింపుతున్నారు ఎన్నారైలు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసొసియేషన్ (టిటా) ,ఎన్నారైలు సంయుక్తంగా గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచుతున్నారు. పలు గ్రామాలను దత్తత తీసుకుని వందశాతం డిజిటల్ అక్షరాస్యత గల గ్రామాలుగా మారుస్తున్నారు.

ఇలా తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామంగా సూర్యాపేట జిల్లాలోని దొండపాడుని తీర్చిదిద్దారు ఎన్నారై అప్పిరెడ్డి అన్నపరెడ్డి. ఈ నెల 30న క్లోజింగ్ సెర్మనీ ఆఫ్ డిజిటల్ దొండపాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో జరిగే ఈ కార్యక్రమానికి ఎహెచ్ఆర్ఎఫ్ ఫౌండేషన్ అధినేత అప్పిరెడ్డి తొలి ఎన్నారై స్పాన్సర్.