డిజిటల్ అ ఆ లు...! - MicTv.in - Telugu News
mictv telugu

డిజిటల్ అ ఆ లు…!

September 8, 2017

డిజిటల్‌ అక్షరాస్యతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒకరు డిజిటల్‌ అక్షరాస్యత కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తున్న చిత్రాలను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. తెలంగాణలో డిజిటల్‌ అక్షరాస్యతకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు.