‘‘ఓ 500 ఫోన్ పే చేయ్ గురూ, వారంలో ఇస్తా,’’, ‘‘చెక్కు వద్దూ గిక్కూ వద్దే, బ్యాంకుకు వెళ్లేంత సీన్ లేదు. ఆ పదివేలు ఫోన్ పే కొట్టు బ్రో’’, ‘‘అర్ధ కేజీ జామకాయలు కొనుక్కుని 500 నోటు ఇస్తావా, మాంచి బేరమే. చిల్లరలేదు, ఆ ఇరవై రూపాయలు ఫోన్ పే చెయ్, ఇదిగో అట్ట.’’ ఇలా ఉందండి లోకం. వేల రూపాయల దగ్గర్నుంచి కొత్తిమీర కట్టవరకు కోట్లమంది డిజిటల్ పేమెంట్లకు బాగా అలవాటు పడిపోయారు. ఎంతంగా అంటే కేవలం ఒక్క ఫోన్ పే మాత్రమే ఏకంగా 84 లక్షల కోట్ల వార్షిక టోటల్ పేపెంట్ వాల్యూ సాధించేంతంగా. తమ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ మొత్తంలో ఫోన్ పే నుంచి లావాదేవీలు జరిగినట్లు ఫోన్ పే కంపెనీ కన్య్జూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర తెలిపారు. తమ టీపీవీ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోసషంగా ఉందని చెప్పిన ఆమె, క్రెడిన్ ఆన్ యూపీఐ, యూపీఐ ఇంటర్నేషనల్ వంటి సరికొత్త సేవలను కూడా దేశ ప్రజలకు అందిస్తామన్నారు. మన దేశంలో ఫోన్ పేకి మూడున్నర కోట్లకుపై యూజర్లు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులో సగానికిపైగా దీన్నుంచే సాగుతున్నాయి.