కామ్రేడ్ కమలమ్మ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

కామ్రేడ్ కమలమ్మ కన్నుమూత

November 21, 2017

జీవితాంతం తాను నమ్మిన కమ్యూనిస్టు విలువకు కట్టుబడిన వామపక్ష నాయకురాలు, రచయిత్రి, శ్రీకాకుళ గిరిజన ఉద్యమ నేత  దిగుమర్తి కమలమ్మ తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల కమలమ్మ మంగళవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయారు.  వయోభారం వల్ల గత కొన్నేళ్ల నుంచి ఆమె ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏకైక కుమార్తె స్వర్ణ దగ్గర ఉంటున్నారు. ఆమె భర్త, లెఫ్ట్ నేత  విశ్వనాథ్ 2009లో కన్నుమూశారు. వీరి కుమారుడు ప్రేంచంద్ న్యాయవాది, జర్నలిస్టు కూడా.  వి శ్వనాథ్, కమలమ్మలది ఆదర్శ వివాహం. కట్టుబాట్లను ఛేదించుకుని పెళ్లి చేసుకున్నారు.సీపీఐ చీలిపోయాక సీపీఎం వెంట నడిచారు. శ్రీకాకుళం జిల్లాలో  సీపీఎంకు తిరిగి జీవం పోయడానికి కృషిచేశారు. కమలమ్మ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ప్రధానోపాధ్యాయురాలిగా, డిప్యూటీ డీఈవోగా పనిచేస్తూ రాజీనామా చేశారు. అభ్యదయ రచయితల సంఘంలోనూ ఆమె పనిచేశారు,.