కుంతియా..కుంటుతున్న కాంగ్రెస్ ను  పరిగెత్తించగలడా.? - MicTv.in - Telugu News
mictv telugu

కుంతియా..కుంటుతున్న కాంగ్రెస్ ను  పరిగెత్తించగలడా.?

August 12, 2017

దిగ్విజయ్ సింగ్ ను  దించేసి  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఆర్సీ కుంతియాను  కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే…అయితే ఈరోజు కుంతియా హైద్రాబాద్ వచ్చారు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా రాబోవు రోజుల్లో కార్యాచరణలు ఉంటాయని కుంతియా తెలిపారు.తెలంగాణ కు నేను కొత్త కాదు..గతంలో డిప్యూటీ ఇంచార్జ్ గా పనిచేసాను.ఆ అనుభవంతో ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అయితే ఇప్పుడు పూర్తిగా ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టాను. నేను తాత్కాలిక ఇన్ ఛార్జ్ అనడంలో వాస్తవం లేదు, నన్ను పూర్తి స్థాయి బాధ్యతలతోనే రాహుల్ గాంధీ పంపారు,నేను నాయకుడిగా కాదు…కార్యకర్తగా వచ్చా.రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇవ్వడానికి రాలేదు,పార్టీ లో కార్యకర్త లా పనిచేస్తా… తెలంగాణ లో 560 మండలాలలో కాలపరిమితి నిర్ధేశించుకుని పర్యటిస్తా.సందేశ్ యాత్రలను నియోజకవర్గాలుగా, మండల స్థాయిలో కూడా పెట్టి  ప్రభుత్వంలో ఉన్న లోపాల్ని ప్రజల ముందు పెడతాం.సీఎం, మంత్రులే టీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధిదారులు..ఏ ఒక్క వర్గం లాభపడలేదు. సిరిసిల్లలో దళితులు, బలహీనవర్గాల పై దాడులు జరిగాయి, దీనిపై ఇప్పటికే ఎన్ ఎచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశాం. మండల స్థాయికి అగ్రనాయకత్వాన్ని తీసుకువెళతా.అన్ని పార్టీలో ఉన్న విభాగాలను పరిగెత్తిస్తా.టిఆర్ ఎస్ ప్రత్యామం మేము , తెలంగాణాలో బిజెపి లేదు,టిడిపి లేదు ఇతర పార్టీలు లేవు.ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి,మేమేంటో అప్పుడు చూద్దురు గానీ…పొత్తుల విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేం..ముందు పార్టీని బలోపెతం చేస్తాం.ఇతర పార్టీల వాళ్లు మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. 2019లో ప్రభుత్వంలోకి వచ్చేలా కార్యచరణ.సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ఎజెండా అని కుంతియా చెప్పారు.

కేసీఆర్ కు సవాల్ అంటూ గాండ్రించిన కుంతియా..

కేసీఆర్ తను చేయించుకున్న సర్వేలో కాంగ్రెస్ పార్టీకి రెండే సీట్లు వస్తాయని అన్న విషయాన్ని కుంతియా విలేఖర్ల చిట్ చాట్ లో గుర్తు చేశారు.అయితే వివిధ పార్టీలనుంచి టీ ఆర్ ఎస్ లోకి లాక్కున్న ఎమ్మెల్యేలను,ఎం.పిలను రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలు పెడితే అప్పుడు తెలుస్తుంది..ఎవరికి రెండు సీట్లు వస్తాయో.