Dil Preet went at a speed of 310 km on a bike
mictv telugu

బైక్‌ మీద 310 కి.మీ స్పీడుతో వెళ్లి మనకు వార్నింగ్ ఇస్తున్నాడు

October 28, 2022

అతివేగం ఎంత ప్రమాదకరమో వాహనదారులకు తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోతాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లి నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే హర్యానాలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగింది. ఓ బైకర్ గంటకు 310 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Wild Wing Rider (@wildwingriders)

దిల్ ప్రీత్ అనే బైకర్ తన నలుగురు స్నేహితులతో కలిసి ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడు. ఖరీదైన నింజా 2000, బీఎండబ్ల్యూ, డ్యుకాటీ, అపాచీ 310 వంటి బైకుల మీద ఆదివారం రైడ్ ప్రారంభించి వాయు వేగంతో దూసుకెళ్లారు. 300 కిలోమీటర్ల వేగం అందుకోగానే వీడియో తీసి ఇలా ఎవరూ చేయవద్దంటూ హెచ్చరించడం వీడియోలో కనిపిస్తోంది. ఆగస్ట్ 20న అప్ లోడ్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయ రోడ్లపై ఇంత వేగంతో ఎలా నడిపావు బ్రదర్ అంటూ కొందరు ఆరా తీస్తుండగా, చావు నోట్లో తల పెడుతున్నావని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారు.