Dil Raj Satyamani who gave birth to a male child
mictv telugu

మగబిడ్డకు జన్మనిచ్చిన..దిల్ రాజ్ సతీమణి తేజస్విని

June 29, 2022

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటికి వారుసుడొచ్చాడు. నేడు ఉదయం దిల్‌ రాజు సతీమణి తేజస్విని మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దిల్ రాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ‘దిల్‌ రాజు ఇంటికి వారసుడొచ్చాడు’ అంటూ టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన డిసెంబర్‌ 10, 2020న నిజామాబాద్‌లో తేజస్వినిని వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో నేడు ఉదయం తేజస్విని మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఇటు టాలీవుడ్ వర్గాలు అటు ఇరుకుటుంబాలు సంతోషంలో మునిగితేలుతున్నాయి.

దిల్ రాజు అసలు పేరు వెంకట రమణా రెడ్డి. తెలుగులో అగ్ర నిర్మాత. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. దిల్ రాజ్ నిర్మించిన మొదటి చిత్రం ‘దిల్’. ఆ చిత్రం అనంతరం ఆయనకు దిల్ రాజు అనే పేరు స్థిరపడిపడింది. దిల్ రాజు నిర్మించిన మహర్షి సినిమాకు 2020లో మోస్ట్‌ పాపులర్‌ మూవీ అవార్డును అందుకున్నాడు.