Dil Raju made funny comments on Akkineni's heroes
mictv telugu

ఈ హీరోలకు ఒక్క హీరోయిన్ సరిపోదు.. నోరు జారిన దిల్ రాజు

July 16, 2022

Dil Raju made funny comments on Akkineni's heroes

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సరదాగా మాట్లాడుతూ నోరు జారారు. అక్కినేని ఫ్యామిలీపై ఆయన చేసిన వ్యాఖ్యను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘అక్కినేని కుటుంబంలో ఉండే హీరోలకు ఒక్క హీరోయిన్ ఏం సరిపోతుంది’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని హేటర్స్ దీనిని మరో కోణంలో ట్రోల్ చేస్తున్నారు.

‘నిజమే. ఈ హీరోలకు ఒక్క హీరోయిన్ సరిపోదు’ అంటూ వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను దీనికి ముడిపెడుతున్నారు. అక్కినేని నాగార్జున మొదట నాగచైతన్య తల్లిని పెళ్లి చేసుకొని అనంతరం విడాకులిచ్చి అమలను వివాహమాడాడు. అక్కినేని అఖిల్ ముందుగా నిశ్చితార్ధం చేసుకొని దానిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇక అక్కినేని నాగచైతన్య విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు సంసారం చేసి విడాకులు తీసుకున్నాడు. కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా ఈ టాపిక్ ఇప్పటికీ ప్రేక్షకుల నోట్లో నానుతోంది. ఈ నేపథ్యంలో థ్యాంక్యూ చిత్ర నిర్మాత కూడా అయిన దిల్ రాజు సరదాగా సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టినట్టయింది.