వారసుడిని చూసి మురిసిపోతున్న దిల్ రాజు.. పిక్స్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

వారసుడిని చూసి మురిసిపోతున్న దిల్ రాజు.. పిక్స్ వైరల్

July 4, 2022

మొదటి భార్య మరణంతో రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల మరోసారి తండ్రయిన విషయం తెలిసిందే. ఆయన భార్య తేజస్విని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అందరూ దిల్ రాజుకు వారసుడు వచ్చాడని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు హాస్పిటల్‌లో తన కుమారుడిని ఎత్తుకున్న ఫోటో ఒకటి అభిమానులకు షేర్ చేశాడు. అందులో భార్య తేజస్విని కూడా ఉంది. కాగా, తేజస్విని దూరపు బంధువుల అమ్మాయి. తన మొదటి భార్య ద్వారా ఓ కూతురు ఉండగా, ఆమె ఒత్తిడితోనే దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నాడని అప్పట్లో టాక్ వచ్చింది. ఏది ఏమైనా దిల్ రాజు ఇంటికి వారసుడు రావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు.