రెండో  పెళ్లిపై స్పందించిన దిల్ రాజు - MicTv.in - Telugu News
mictv telugu

రెండో  పెళ్లిపై స్పందించిన దిల్ రాజు

February 27, 2020

raju dil

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గత కొన్ని రోజులుగా వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అమెరికా అమ్మాయితో అతని పెళ్లి సిక్రెట్‌గా జరిగిపోయిందనే కథనాలు వచ్చాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఒత్తిడితో రెండో పెళ్లికి అంగీకరించినట్టు వైరల్ కావడంతో ఈ విషయం దిల్ రాజు దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన తాజాగా స్పందిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. 

రెండో పెళ్లిపై వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ఒక వార్తా పత్రిక ప్రారంభించిన పుకారు వార్తను అంతా నిజం అనుకుంటున్నారని చెప్పారు. తనకు రెండో పెళ్లిపై ఆసక్తి లేదని తెలిపారు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే మాత్రం అధికారికంగా ప్రకటిస్తానని అన్నారు. ఇప్పటి వరకూ తాను పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. కాగా మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి ఆయన సింగిల్‌గానే ఉంటున్నారు.