భార్యతో దిల్ రాజు తొలి సెల్ఫీ..  - MicTv.in - Telugu News
mictv telugu

భార్యతో దిల్ రాజు తొలి సెల్ఫీ.. 

May 13, 2020

Dil Raju Selfie With His Second Wife

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు జంట పెళ్లి తర్వాత తొలిసారి సెల్పీకి ఫోజు ఇచ్చారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను ఈ కొత్త జంట సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దిల్ రాజు భార్య తేజస్విని (వైఘా రెడ్డి) ఈ సెల్పీ తీస్తూ కనిపించారు. దీంతో ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి. వీటిని చూసిన పలువురు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించడంతో అతని కూతురు హన్షితా రెడ్డి మరో పెళ్లి చేయాలని అనుకుంది. ఆమె స్వయంగా ఓ అమ్మాయిని ఎంపిక చేసింది. దీంతో వీరికి ఈ నెల 10న రాత్రి నిజామాబాద్‌లోని  నర్సింగ్ పల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో  వివాహం జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్ష్యంలో ఈ వేడుక నిర్వహించారు. కాగా ఈ పెళ్లి చివరి వరకు కూడా పూర్తి సస్పెన్స్‌గా ఉంచారు. పెళ్లి తర్వాత వధువు ఎవరనే దానిపై నెటిజన్లు ఇంకా ఆరా తీస్తూనే ఉన్నారు. ఆమె బ్రాహ్మణుల అమ్మాయి అని కొందరు, దిల్ రాజు బంధువుల అమ్మాయి అని మరి కొందరు అంటున్నారు. అయితే దీనిపై దిల్ రాజు కుటుంబం స్పందిస్తే కానీ క్లారిటీ రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.