దిల్ రాజు కొడుకు ఫోటో వైరల్.. ‘వారసుడి’తో.. - MicTv.in - Telugu News
mictv telugu

దిల్ రాజు కొడుకు ఫోటో వైరల్.. ‘వారసుడి’తో..

November 1, 2022

షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్ కొడుకుతో సరదాగా ఆడుకుంటూ కెమెరాకు చిక్కాడు స్టార్ హీరో, తమిళ దళపతి విజయ్. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు టాలీవుడ్‌లో కుటుంబ కథా చిత్రాలు తీస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న దిల్ రాజు. ఆయన ఈ మధ్యే మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. ఆయన సతీమణి తేజస్విని ఈ ఏడాది జూన్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా దిల్‌రాజు వారసుడి ఫోటో నెట్టింట లీక్‌ అయ్యింది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ దిల్‌రాజు కొడుకును ఎత్తుకున్న ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు దిల్‌రాజు ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో దిల్‌రాజు ఇంటికి వచ్చిన విజయ్‌ ఆయన కొడుకును ఎత్తుకొని ఆడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు కొడుకు క్యూట్ గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా తల్లి వైఘారెడ్డి కంటే తండ్రి దిల్ రాజు పోలికలు కొడుకుకు ఎక్కువగా వచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.50 సంవత్సరాల వయస్సులో దిల్ రాజు కొడుకుకు తండ్రి కావడం గమనార్హం.