Dinesh Arora became an approver in the Delhi liquor scam
mictv telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. అప్రూవర్‌‌‌‌గా మారిన కీలక నిందితుడు

November 7, 2022

Dinesh Arora became an approver in the Delhi liquor scam

దేశవ్యాప్తంగా సంచలంన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారాడు. ఈ మేరకు సీబీఐ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసింది. దినేశ్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ పిటిషన్‌‌‌‌‌లో పేర్కొంది. ఇందులో భాగంగా దినేశ్ వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది.

దర్యాప్తు అధికారులకు దినేశ్ సహకరిస్తున్నారని, ఇప్పటికే కీలక సమాచారాన్ని అందించారని తెలిపింది. అది చూసిన ధర్మాసనం.. ఎవరైనా బెదిరించారా? ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? అని దినేశ్ అరోరాను అడిగారు. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేశారు. గతవారమే దినేశ్‌కి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కాగా, మద్యం కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇందులో దినేశ్ అరోరాతో పాటు ఢిల్లీ ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రలు ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 120బీ, 477ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేపట్టింది.