Dinesh Karthik Drops Retirement Hint With Cryptic Instagram Post
mictv telugu

దినేష్ కార్తీక్ భావోద్వేగ వీడియో..క్రికెట్‌కు గుడ్ బై?

November 24, 2022

2022 T20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత భారీ మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతుంది. సీనియర్లను పనక్కబెట్టి యువ ఆటగాళ్లను తీర్చి దిద్దాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ ఆటగాళ్లపై వేటుపడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో దికేష్ కార్తీక్ పోస్ట్ చేసిన ఓ భావోద్వేగ వీడియో పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. వీడియో చూసిన వారిలో రిటైర్మెంట్ కోసం దినేష్ కార్తిక్ హింట్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దినేష్ కార్తీక్ వీడియోలో ఏముంది..

“2022టీ 20 ప్రపంచకప్ ఆడేందుకు కష్టపడ్డాను. ఆ కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ టోర్నిలో మేము విజయం సాధించకపోవచ్చు..కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ధన్యవాదాలు” అంటూ ఇన్ స్టా వేదికగా ఉద్యోగపూరితమైన వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో త్వరలోనే డీకే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది రిటైర్మెంట్ వద్దు డీకే అంటు కామెంట్లు పెడుతున్నారు.

ఇక జట్టులో చోటు కష్టమే..

ఐపీఎల్‌లో అదరగొట్టి ఇండియన్ టీంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు దికేష్ కార్తీక్. ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించాడు. అయితే అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు.చివరికి కీలక మ్యాచ్‌ల్లో చోటు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను బీసీసీఐ సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్‌ 2023 సన్నాహాకాల్లో భాగంగా భారత్‌ వచ్చే రోజుల్లో ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. దీంతో ‘డీకే’ కి వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిసున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌కు డీకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.