వెరీ వెరీ స్పెషల్.. గుడ్డులో మరో గుడ్డు - MicTv.in - Telugu News
mictv telugu

వెరీ వెరీ స్పెషల్.. గుడ్డులో మరో గుడ్డు

June 14, 2022

గుడ్డులో గుడ్డేంది అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే ఈ వింత ఘటన జరిగింది. అయితే అది డైనోసార్ గుడ్లు. ఎప్పుడో అంతరించిపోయిన ఈ జాతి శిలాజాలపై పరిశోధన చేస్తున్న సైంటిస్టులు కనుగొన్న కొత్త విషయం ఇది. అయితే ఇది ఎక్కడో విదేశాల్లో జరగలేదు. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ధార్ జిల్లాలో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం చేసిన తవ్వకాలలో ఈ విషయం బయటపడింది. డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్కులో తవ్వకాలు జరుపగా, 10 గుడ్ల శిలాజాలను గుర్తించారు. ఈ పది గుడ్లలో ఒకటి మాత్రం స్పెషల్‌గా ఉండడాన్ని సైంటిస్టులలో ఒకరైన వి. ఆర్. ప్రసాద్ గమనించి పగుల గొట్టి చూడగా, అందులో మరో గుడ్డు కనిపించింది. దీంతో విస్తుపోయిన సైంటిస్టులు మరో కోణంలో తమ పరిశోధనను కొనసాగిస్తున్నారు.