దేశంలోనే మొట్టమొదటి‌సారి.. తెలంగాణలో డైనోసార్ పార్క్ - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలోనే మొట్టమొదటి‌సారి.. తెలంగాణలో డైనోసార్ పార్క్

May 23, 2019

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అనేక పథకాలతో పాటు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామంలో ‘డైనో వరల్డ్‌’ పేరుతో డైనోసార్ పార్కును ఏర్పాటు చేశారు.  ఇందులో వివిధ రకాల డైనోసార్ బొమ్మలతో పార్కును ఏర్పాటు చేయగా.. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

Dinosaur Park In Telangana State.. First Time In The Country

దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ డైనో వరల్డ్ పార్కును ఏర్పాటు చేసింది. చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పార్కును తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ పార్కు ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పార్కులోకి అనుమతిస్తామని, ప్రవేశ రుసుం రూ.300 ఉంటుందని తెలిపారు.