గో ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై టీవీ నటి ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

గో ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై టీవీ నటి ఆగ్రహం

December 3, 2019

Dipika 01

ఎయిర్‌లైన్స్ సిబ్బంది చేసిన నిర్వాకానికి ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రయాణికులంతా వచ్చి విమానంలో కూర్చుంటే ఎవరూ సిబ్బంది మాత్రం సకాలంలో రాక చిరాకు తెప్పించారు. దీనిపై ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటి బిగ్‌బాస్ సిజన్ 12 విజేత దీపికా కాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయలుదేరే సమయం అయిపోయినా గో ఎయిర్ విమాన సిబ్బంది ఆలస్యంగా రావడమే కాకుండా కనీసం దీనిపై ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

తన భర్త, షోయబ్, వదిన సబాతో కలిసి ముంబై నుంచి లక్నో వెళ్లేందుకు గో ఎయిర్ విమానం ఎక్కారు. కానీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బయలుదేరే సమయం దాటిపోయింది. దీంతో విమానంలో ఖాళీగా కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడు దీనిపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సుమారు 45 నిమిషాలపాటు వేచి ఉన్నామని మండిపడ్డారు. ఆలస్యంపై సిబ్బందిని ఎంక్వైరీ చేసినా ఫలితం లేదని చెప్పారు. విమాన సిబ్బందికి మర్యాద తెలియదు. జాప్యంపై ఎవరు తెలియజేస్తారోనని ఎదురు చూస్తూనే ఉన్నామని తెలిపారు. కాగా దీపిక ‘కహాన్ హమ్ కహాన్ తుమ్’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.