అభిమానుల ఆశ్రునయనాల మధ్య కలతపస్వీ కె. విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో పంజాగుట్టలోని శ్మశాన వాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలను నిర్వహించారు. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు జరిగాయి. ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వీకి తుది వీడ్కోలు పలికారు. అంతకుమందు ఫిలిం చాంబర్‌లో కే విశ్వనాథ్ పార్థీవదేహానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.
గురువారం రాత్రి విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కే విశ్వనాథ్ ఎన్నో మరుపురాని సినిమాలను అందించారు.
ఇవి కూడా చదవండి :
చనిపోయే ముందు పాట రాసిన కళాతపస్వీ విశ్వనాథ్…
కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు…శోకసంద్రంలో టాలీవుడ్..!!
శంకరాభరణాన్ని 25సార్లు చూశా.. కేసీఆర్
కళాతపస్వి గురించి ఆసక్తికరమైన విషయాలు..